
గర్భిణులకు వైద్య పరీక్షలు
చింతపల్లి: ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో శుక్రవారం గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో 84 మంది గర్భిణులకు స్కానింగ్ తదితర పరీక్షలు చేశారు. ఈ సంర్భంగా గైనకాలజిస్టు ఎస్.వాసవి మాట్లాడుతూ గర్భిణులు ఆస్పత్రుల్లోనే ప్రసవాలు చేసుకోవాలని, దీంతో తల్లి, బిడ్డ ఆరోగ్యానికి ఎంతో సురక్షతిమన్నారు. గర్భిణులు తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
అడ్డతీగల: మండల కేంద్రంలోని సీహెచ్‌సీలో వైద్యాధికారి ప్రసన్నదేవి ఆధ్వర్యంలో 87 మంది గర్భిణులకు వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణులు రక్తహీనత సమస్య లేకుండా చూసుకోవాలని, పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పండా సతీష్ మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలపై గర్భిణులు అప్రమత్తంగా ఉ
ండాలన్నారు.
వై.రామవరం: మండల కేంద్రంలోని సీహెచ్‌సీలో సూపరింటెండెంట్ డాక్టర్ చైతన్యకుమార్ ఆధ్వర్యంలో 64 మంది గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా 21 మంది హైరిస్క్ గర్భిణులను ఆస్పత్రిలో చేర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ గర్భిణులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. చవిటిదిబ్బలు పీహెచ్‌సీలో వైద్యాధికారి డాక్టర్ శ్రావణి ఆద్వర్యంలో గర్భిణులకు స్కానింగులు, ప్రత్యేక వైద్యపరీక్షలు నిర్వహించారు.

గర్భిణులకు వైద్య పరీక్షలు

గర్భిణులకు వైద్య పరీక్షలు