
ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలి
పెదబయలు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలకు చేస్తున్న మోసాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు మజ్జి చంద్రుబాబు అన్నారు. వైఎస్సార్‌సీపీ అధిష్టానం ఆదేశాల మేరకు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సూచనల మేరకు మండలంలోని అడుగులపుట్టు పంచాయతీలో రచ్చబండ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలకు మోసం చేస్తున్నారన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందించాలనే లక్ష్యంతో ప్రతి జిల్లాలో ఓ మెడికల్ కళాశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారన్నారు. అయితే ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్‌కు దారాదత్తం చేయాలని చూస్తున్నారన్నారు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు కుచ్చుటోపి పెట్టారని, రాష్ట్రంలో నిరుద్యోగులకు. మహిహిళలకు మోసం చేశారన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాడు–నేడు ద్వారా పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించి చదువుల విప్లవం చేస్తే నేడు పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ పాఠశాలల్లో సరైన సదుపాయాలు లేవన్నారు. కలుషిత ఆహారంతో విద్యార్థులు మృత్యువాత పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు వైఎస్సార్‌సీపీ శ్రేణులు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. నాయకులు పోయిభ కృష్ణారావు, చిట్టపులి అన్నపూర్ణ. కొర్ర హరి, పంచాయతీ కమిటీ నాయకులు పాంగి గోవర్థన్, ఆనందరావు, జగత్‌రాయ్, తిరుపతిరావు, కొర్ర నాగేశ్వరరావు, కామేశ్వరరావు, నాగరాజు,సొనదోర్, మన్మథరావు, కుర్తాడి సోమేశ్వరరావు, ధనలక్ష్మీ, కార్యకర్తలు పాల్గొన్నారు.