
బుట్ట పూలు నిన్న రూ.400.. నేడు రూ.200
మిగతా 2వ పేజీలో
సాక్షి,పాడేరు: ఏజెన్సీలో సీతమ్మ కాటుక రకం బంతిని సాగు చేసే రైతులను దసరా మార్కెట్ నిరాశ పరిచింది. దిగుబడి తగ్గినా పండగ నేపథ్యంలో ధర మరింత పెరుగుతుందని ఆశించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. గత రెండు రోజుల నుంచి పాడేరు మార్కెట్‌కు బంతిపూలు తక్కువగా వచ్చినప్పటికి ధర మాత్రం పెరగలేదు. మంగళవారం బుట్ట (ఐదు కిలోలు) బంతిపూలను రూ.400కు కొనుగోలు చేసిన వ్యాపారులు ఒక్క రోజు వ్యవధిలో ధరను పతనం చేశారు. బుధవారం
పండగలో ధర లేకపోవడం బాధాకరం
దసరా పండగ వల్ల బంతి పూల ధర అధికంగా ఉంటుందని ఆశపడ్డా. నిన్న బుట్ట రూ.400కు కొన్న వ్యాపారులు ఒక్క రోజుకే రూ.200 తగ్గించేశారు. ఒక్కసారిగా రూ.200 ఆదాయం కోల్పోయా. పండగ సమయంలో తక్కువ ధరకు అమ్మాల్సి రావడం బాధ కలిగించింది.
– కె.ముత్యాలమ్మ, ఇరడాపల్లి, పాడేరు మండలం
సీతమ్మ కాటుక బంతి ధర పతనం
ఒక్కరోజులో రూ.200 తగ్గుదల
వ్యాపారుల మాయాజాలం
గిరి రైతులను నిరాశపర్చిన
దసరా మార్కెట్

బుట్ట పూలు నిన్న రూ.400.. నేడు రూ.200

బుట్ట పూలు నిన్న రూ.400.. నేడు రూ.200