
రైల్వే విశ్రాంత ఉద్యోగి నేత్రాలు దానం
పెందుర్తి: మరణించిన తన తండ్రి నేత్రాలను దానం చేసి ఇద్దరు కుమారులు పెద్ద మనసును చాటుకున్నారు. పెందుర్తిలోని వెలమతోటలో నివాసం ఉంటున్న రైల్వే విశ్రాంత ఉద్యోగి నేమాని భవానీశంకరం(84) మంగళవారం ఉదయం మృతి చెందారు. దీంతో సాయి హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు దాడి శ్రీనివాస్ నేత్రదానం కోసం మృతుని కుటుంబాన్ని సంప్రదించారు. దీంతో తండ్రి నేత్రాలను దానం చేయడానికి కుమారులు నేమాని రాంబాబు, వంశీ అంగీకారం తెలిపారు. దీంతో ఎల్‌వీ ప్రసాద్ మోషిన్ ఐబ్యాంక్ ప్రతినిధి కృష్ణ.. భవానీశంకరం నేత్రాల(కార్నియా)ను సేకరించారు. తండ్రి నేత్రాలను దానం చేసి ఇద్దరు అంధులకు చూపు అందించేందుకు సహకరించిన కుమారులను పలువురు ప్రశంసించారు.