
కొట్టుకుపోయిన వంతెన.. నిలిచిన రాకపోకలు
కొట్టుకుపోయిన గంగవరం వంతెన
సీలేరులో కురుస్తున్న వర్షం
సీలేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా,జీకే విధి మండలం,దారకొండ పంచాయతీలో మంగళవారం తెల్లవారుజామున ఎడతెరిపి లేకుండా నాలుగు గంటల పాటు ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. ఆంధ్రా ఒడిశా సరిహద్దు సీలేరు అటవీ ప్రాంతం సప్పర్ల రెంగేజ్ దారులమ్మ తల్లి ఘాట్‌రోడ్డు ఇలా అన్ని ప్రాంతాలు భారీ వర్షంతో జలమమమయ్యాయి. పెద్ద ఎత్తున భారీ వర్షం కురవడంతో స్థానికలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దారకొండ సీలేరు ప్రాంతాల్లో రోడ్లపైకి పెద్ద ఎత్తున వర్షపు నీరు ప్రవహించింది. డ్రైనేజీలో మురుగునీరు రోడ్లపైకి రావడంతో దిగునున్న ఇళ్లల్లోకి ప్రవహించింది.
కొట్టుకుపోయిన చిన్న గంగవరం వంతెన
మంగళవారం తెల్లవారుజామున ఎడతెరిపి లేకుండా ఉరుములతో కురిసిన భారీ వర్షానికి సీలేరు దుప్పులవాడ గుమ్మరేవుల పంచాయతీలో పలు వాగులు, గెడ్డలు ఉధృతంగా ప్రవహించాయి. దారకొండ పంచాయతీ చిన్న గంగవరం గ్రామం మీద ఒడిశా వెళ్లే ప్రధాన వంతెన కొట్టుకుపోయింది. దీంతో ఉధృతంగా వరదలు నీరు ప్రయాణించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గత సెప్టెంబర్‌లో ఈ వంతెన కొట్టుకుపోయి నేటికీ ఏడాదిన్నర దాటుతున్న ఆ ప్రాంత ప్రజలు కలెక్టర్. ప్రభుత్వాన్ని పలుమార్లు వంతెన నిర్మించాలని కోరిన పట్టించుకోవడం లేదు. దీంతో గిరిజనులు తాత్కాలికంగా వంతెన నిర్మించి రాకపోకలు సాగిస్తున్నారు. అయినప్పటికీ ఇలా వర్షాలు కురిసినప్పుడు ప్రతీసారి కొట్టుకుపోవడంతో నాలుగైదు రోజులు రాకపోకలు నిలిచిపోయి నిత్యావసరకులు అందక ఇబ్బందులు పడుతున్నామని పలువురు చెబుతున్నారు. భారీ వర్షానికి బ్రిడ్జీ పై నుంచి వర్షపు నీరు ప్రవహించింది. పిల్లిగడ్డ వాగు నుంచి భారీ వర్షం నీరు సీలేరు రిజర్వాయర్‌లోకి చేరింది. నిమ్మచెట్టు, తోకరాయి గ్రామాల్లో కూడా వరదనీరు భారీగా వచ్చినట్టు స్థానికులు తెలిపారు. దారాలమ్మ ఘాట్ రోడ్డులో కురిసిన వర్షపు కొంగపాకల. మాదిగమల్లు వంతల నుంచి వర్షపు నీరు దిగునున్న రిజర్వాయర్లోకి ప్రవహించింది.
వంతెన తక్షణమే నిర్మించాలి
ఆంధ్ర–ఒడిశా సరిహద్దు గిరిజనులకు ప్రధాన రహదారైన చిన్న గంగవరం వంతెన తక్షణమే నిర్మించాలని స్థానికులు, గిరిజన సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో కొట్టుకుపోయిన వంతెన ఇప్పటివరకు నిర్మించకపోవడం గిరిజన గ్రామాల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందో తెలుస్తుందన్నారు. ఏడాదిగా ఈ వంతెన నిర్మించాలని కోరుతున్నా అధికారులు, ప్రభుత్వం స్పందించడం లేదంటున్నారు. అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించినప్పటికీ అనుమతులు రాకపోవడంతో ఈ ప్రాంత గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి గిరిజన సంఘం అధ్యక్షుడు పాంగి నాగేశ్వరరావు, సీపీఐ మండలం కార్యదర్శి కవర్ల భగవాన్, వార్డ్ సభ్యుడు బలరాం అధికారులకు డిమాండ్ చేస్తున్నారు.
రాజవొమ్మంగిలో భారీ వర్షం
రాజవొమ్మంగి: రాజవొమ్మంగి పరిసర ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. దీంతో పల్లపు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. మట్టిరోడ్లు చిత్తడిగా మారడంతో ప్రజలు నానా ఇబ్బంది పడ్డారు. కాగా ఈ వర్షం వరి పంటకు మేలు చేస్తుందని రైతులు చెబుతున్నారు. మరోవైపు పంటలపై ఆశించే తెగుళ్లు,, పురుగులు ఈ వర్షం వల్ల అదుపులోకి వస్తాయని చెబుతున్నారు. ఇదిలా ఉండగా రెండు రోజులుగా మండలంలో నెలకొన్న పొడి వాతావరణానికి రైతులు తమ పొలాలకు ఎరువులు వెదజల్లే పనిలో పడ్డారు. అలాగే తెగుళ్లు పురుగు మందులు పిచికారీ చేశారు. అయితే ఉన్నట్లుండి భారీ వర్షం కువరడంతో పిండి, రసాయన మందులు కొట్టుకొని పోయాయని, దీంతో నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
రాజవొమ్మంగిలో కురుస్తున్న వర్షం
భారీ వర్షానికి కోతకు గురైన
గంగవరం బ్రిడ్జి
అగ్రహారం బ్రిడ్జిపై నుంచి ఉధృతంగా పొంగి ప్రవహిస్తున్న వరదనీరు
నిత్యావసర సరకులు అందక
గిరిజనుల అవస్థలు

కొట్టుకుపోయిన వంతెన.. నిలిచిన రాకపోకలు

కొట్టుకుపోయిన వంతెన.. నిలిచిన రాకపోకలు

కొట్టుకుపోయిన వంతెన.. నిలిచిన రాకపోకలు