
మాడగుడ సన్‌రైజ్ వ్యూపాయింట్‌కు తరలివచ్చిన పర్యాటకులు (ఇన్‌సెట్)
మాడగడ గిరిజనుల్లో ఎకో టూరిజం ప్రాజెక్ట్ గుబులు
మాడగడ వ్యూపాయింట్ వద్దఎకో టూరిజం ప్రాజెక్ట్ ఏర్పాటుకు అటవీశాఖ సన్నాహాలు
కార్యకలాపాలు నిర్వహించకుండా అటవీశాఖ ఆంక్షలు
ప్రత్యక్షం, పరోక్షంగా ఆధారపడిన 300 కుటుంబాలపై ప్రభావం
మా పొట్ట కొట్టొద్దని మాడగడ,పకనగుడ, బురిడిగుడ, ఎం.హట్టగుడ, వంతమూరు గిరిజనుల విన్నపం
అరకులోయ టౌన్: గత నాలుగేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్ అనతి కాలంలో ప్రాచుర్యం పొందింది. స్థానిక గిరిజనులు, మోటార్ యూనియన్ ప్రతినిధులు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడంతో ఏడాది పొడవునా పర్యాటకుల తాకిడి ఉంటుంది.
గత నాలుగేళ్లుగా పట్టించుకోని అటవీశాఖ..
నాలుగేళ్లుగా పట్టించుకోని అటవీశాఖ అధికారులు ఇప్పుడు వ్యూపాయింట్ ప్రాంతం అటవీశాఖకు చెందినదిగా ప్రకటించారు. ఇక్కడ ఎటువంటి కార్యకలాపాలు సాగించరాదని సూచనలు జారీ చేశారు. ఈ ప్రాంతంలో స్థానిక గిరిజనులు ఏర్పాటుచేసిన ఊయల, థింసా చేసే పరిసరాల్లోని పందిరిని తొలగించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏర్పాటుచేయబోయే ఎకో టూరిజం ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తూ పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసింది.
● మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్‌పై ఆధారపడి సుమారు 300కు పైగా కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నాయి. మాడగడ, పకనగుడ, బురిడిగుడ, ఎం.హట్టగుడ, వంతమూరు తదితర గ్రామాల గిరిజనులు ప్రతీ రోజు ఉదయం ఐదు గంటల నుంచి వ్యాపారాలు చేపట్టి ఆదాయం పొందేవారు. అల్పహారం, టీ, కాఫీ, మొక్కజొన్న పొత్తులు, జామకాయలు, ఇతర తినుబండరాలు విక్రయించి రోజూ రూ.వేలల్లో ఆదాయం ఆర్జించేవారు.
● డప్పు, వాయిద్యాలతో థింసా కళాకారులు నృత్యాలు చేస్తూ పర్యాటకులను అలరించేవారు. వారు ఇచ్చే పైకంతో ఉపాధి పొందేవారు.
● పర్యాటకుల్లో ఆడవారికి గిరిజన సంప్రదాయ చీర కట్టు, మగవారికి పంచికట్లు, తగపాగ, కండువా వేసి సిద్ధం చేస్తే రూ.200 చెల్లించేవారు. ఇప్పుడు ఈ ఆదాయానికి గండి పడింది.
● చిన్నారులు ఆడుకునేందుకు ఆట వస్తువులు, చిన్న చిన్న కార్లు, సైకిళ్లు, గుర్రపు స్వారీ ద్వారా ఆదాయం పొందేవారు.
● వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులను మాడగడ నుంచి సన్‌రైజ్ వ్యూపాయింట్ వరకు తీసుకువెళ్లేందుకు ఆటోలో ఒకొక్కరికి రూ.20 తీసుకునేవారు.
● పర్యాటకుల సౌకర్యార్థం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని బోసుబెడ నుంచి మాడగడ సన్‌రైజ్ వ్యూ పాయింట్ వరకు రూ. 13 కోట్లతో రహదారి నిర్మించింది.
ప్రముఖ పర్యాటక కేంద్రం మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్ వద్ద ఎకో టూరిజం ఏర్పాటుకు అటవీశాఖ సన్నాహాలు చేస్తుండటంతో స్థానిక గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. తమ పొట్ట కొట్టొద్దని వారు వేడుకుంటున్నారు.

వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్న మాడగడ పరిసర గ్రామాల గిరిజనులు (ఫైల్)

పెత్తనం

పెత్తనం