
కూటమికి నిరసన సెగ
● రోడ్డెక్కిన వివిధ శాఖల ఉద్యోగులు
● పట్టనట్టు వ్యవహరిస్తున్న రాష్ట్ర సర్కారు
సీలేరు: ప్రభుత్వ పాలన సక్రమంగా సాగాలంటే వివిధ శాఖల ఉద్యోగులు కీలకం.. అలాంటి వారు తమ న్యాయపరమైన కోర్కెలను నెరవేర్చాలని నిరసనలు తెలియజేస్తున్నారు. అయినా కూటమి ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో విద్యుత్ ఉద్యోగులు, కాంటాక్ట్ కార్మికులు, గ్రామ సచివాలయం, వైద్య ఆరోగ్యశాఖ.. ఇలా పలు శాఖల ఉద్యోగులంతా రోడ్డెక్కి ఆందోళనకు దిగారు.
● రాష్ట్రంలో ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కోలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ డిమాండ్లు పరిష్కరించాలని వారం రోజులుగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. జిల్లాలో పొల్లూరు, డొంకరాయి కలిపి 261, మాచ్‌ఖండ్ 175, సీలేరులో131 మంది ఉద్యోగులు తమ న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
● విధులకు సంబంధం లేని సర్వేలు, ఇతర పనుల నుంచి విముక్తి కలిగించాలని గ్రామ సచివాలయ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో 350 గ్రామ సచివాలయాల్లో సుమారు 3వేలకు పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. సచివాలయంలో అన్ని విభాగాల ఉద్యోగులకు ఒకే బేసిక్‌తో పదోన్నతి కల్పిస్తూ పీఆర్సీ స్లాబ్ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తు న్నారు. ఈ నెల 8నుంచి నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నారు.
● హైడ్రో పవర్ ప్రాజెక్ట్టుల అనుమతులు రద్దు కోరుతూ సీపీఎం నెల రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. జిల్లాలో అరకు, పాడేరు ప్రాంతాల్లోని చిట్టంవలసలో 900 మెగావాట్లు, పెదకోటలో 2400 మెగావాట్లు, గుజ్జలిలో 2400 మెగావాట్లు, ఎరవ్రరంలో 1800 మెగావాట్లు, సీలేరులో 900 మెగావాట్ల యూనిట్ల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తోంది. జిల్లాలో ర్యాలీలు, నిరసనలు నిర్వహిస్తోంది.
● ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు సమ్మెకు సన్నద్ధమయ్యారు. ఈ నెల 25 లోగా తమ డిమాండ్లు పరిష్కరించకుంటే 26 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులకు నోటీసులు అందజేశారు. చాలా మంది వైద్యులు పదోన్నతులు లేకుండానే పదవీ విరమణ చేస్తున్నారని సకాలంలో పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇన్–సర్వీస్ పీజీ కోటాను తిరిగి పునరుద్ధరించాలని, ఎస్టీ ఏరియాల్లో పనిచేస్తున్న వారికి బేసిక్ పేపై 50 శాతం ట్రైబల్ అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

కూటమికి నిరసన సెగ

కూటమికి నిరసన సెగ