
జాతీయ ఫొటోగ్రఫీ ఆర్ట్ షోకేస్ నిర్వహణకు ఏర్పాట్లు
● వచ్చేనెల ఒకటి వరకు దరఖాస్తు గడువు
● అడ్డతీగల జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్
మెజిస్ట్రేట్ మురళీ గంగాధరరావు
అడ్డతీగల: జాతీయ ఫొటోగ్రఫీ ఆర్ట్ షోకేస్ నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు స్థానిక జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఎం.మురళీ గంగాధరరావు తెలిపారు. జస్టిస్ ఫర్ ఆల్ త్రోద లెన్స్ ఆఫ్ లీగల్ ఎయిడెడ్ అనే ఏకీకృత అంశంతో జాతీయ ఫొటోగ్రఫీ ఆర్ట్ షోకేస్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. న్యాయ సహాయ సేవల పరిధి ప్రభావాన్ని సృజనాత్మకంగా ప్రజల ముందుకు తీసుకువెళ్లడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆసక్తి ఉండి ఆయా రంగాల్లో ప్రతిభ కలిగిన వారి నుంచి ఫొటోలు, పెయింటింగులు, స్కెచ్‌లు అలాగే గరిష్టంగా ఒక నిమిషం నిడివి కలిగిన షార్ట్ వీడియోలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనదలిచిన వారు అక్టోబర్ ఒకటో తేదీలోపు దరఖాస్తులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం, జిల్లా కోర్టు, రాజమహేంద్రవరం చిరునామాలో అందజేయాలన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థకు అందిన కృతులను స్క్రీనింగ్ చేసి రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థకు పంపుతామన్నారు. ఎంపికై న ఉత్తమ కృతులను జాతీయస్థాయి ప్రదర్శనకు పంపుతామని ఆయన పేర్కొన్నారు.