
ఉత్సాహంగా ఎన్‌సీసీ క్యాడెట్ల ట్రెక్కింగ్
అరకులోయ టౌన్: ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయలో మంగళవారం ఏపీ, తెలంగాణకు చెందిన ఎన్‌సీసీ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ఎన్‌సీసీ ట్రెక్కింగ్ ఎక్స్‌ఫెడిషన్ – 2025 ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా ఉన్న 525 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు, అసోషియేట్ ఎన్‌సీసీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా క్యాంప్ కమాండ్ 13వ ఆంధ్రా బెటాలియన్ ఎన్‌సీసీ విశాఖపట్నం లెఫ్ట్‌నెంట్ కల్నల్ నీరజ్ కుమార్ మాట్లాడారు. క్యాడెట్లలో సాహస స్ఫూర్తి, క్రమశిక్షణ, జాతీయ సమైక్యత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన, గిరిజన సంస్కృతిపై జ్ఞానం పెంపొందిచడమే ఈ ట్రెక్కింగ్ యాత్ర లక్ష్యం అన్నారు. వారం రోజుల పాటు జరిగే ట్రెక్కింగ్‌ను సాంస్కృతిక అన్వేషణ, సమాజ నిశ్చితార్థంతో మిలితం చేస్తుందన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా ఎన్‌సీసీ క్యాడెట్ల ట్రెక్కింగ్