
పిచ్చికుక్క స్వైరవిహారం
మిగతా II పేజీలో
పాడేరులో ఎస్‌ఐతో సహా 14 మందికి గాయాలు
సాక్షి,పాడేరు: పిచ్చి కుక్క స్వైర విహారం చేసి పాడేరు ఎస్‌ఐతో సహా 14 మందిని గాయపరిచింది. పాడేరు నుంచి చింతలవీధి వెళ్లే ప్రధాన రోడ్డులో స్థానిక వైద్య కళాశాల వద్ద బుధవారం ఉదయం పాడేరు ఎస్‌ఐ గోవిందరావు, సిబ్బంది వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. ఇదే సమయంలో అక్కడే సంచరిస్తున్న పిచ్చికుక్క ఒక్కసారిగా ఎస్‌ఐపై దాడి చేసి గాయపరచడంతో సిబ్బంది భయాందోళన చెందారు.తీవ్రంగా గాయపడిన ఎస్‌ఐను జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించారు.అలాగే వైద్య కళాశాలలో చదువుతున్న విద్యార్థులతో పాటు సిబ్బందిపైన పిచ్చికుక్క దాడి చేసింది. అంతేకాకండా ఈ మార్గంలో