● రాష్ట్రస్థాయిలో తొలి నాలుగు
ర్యాంకుల సాధన
● పలువురి అభినందన
తర్రా రాంజీ
కుంతూరు మురళీకృష్ణ
పట్నాల శ్రీకావ్య
ఎం. రాజ్‌కుమార్
చింతపల్లి: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన అగ్రిసెట్‌లో స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో విద్యనభ్యసించిన సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో తొలి నాలుగు ర్యాంకులు సాధించారు. ఈ విషయాన్ని పరిశోధన స్థానం ఏడీఆర్/కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి బుధవారం తెలిపారు. ఆగస్టులో నిర్వహించిన అగ్రిసెట్– 2025 పరీక్షలకు స్థానిక సేంద్రియ వ్యవసాయ కళాశాల నుంచి హాజరైన వారిలో శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన తర్రా రాంజీ మొదటి ర్యాంకు సాధించాడు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం గొట్టుపల్లి గ్రామానికి చెందిన కుంతూరు మురళీకృష్ణ రెండో ర్యాంకు, జి.మాడుగుల మండలం మహా దేవాపురం గ్రామానికి చెందిన మినుములు రాజ్‌కుమార్ మూడో ర్యాంకు, విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెం చైతన్యనగర్‌కు చెందిన పట్నాల శ్రీకావ్య నాలుగో ర్యాంకు సాధించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వీరిని ప్రిన్సిపాల్ డాక్టర్ అళ్ల అప్పలస్వామి, అధ్యాపకులు అభినందించారు.
అగ్రిసెట్‌లో ‘చింతపల్లి’ మెరుపులు
అగ్రిసెట్‌లో ‘చింతపల్లి’ మెరుపులు
అగ్రిసెట్‌లో ‘చింతపల్లి’ మెరుపులు