
అపోహ పడొద్దు
గిరిజనులకు ఎలాంటి నష్టం జరగకుండా పకడ్బందీగా వ్యూపాయింట్ వద్ద వెదురు, చెక్కలతో దుకాణాలు ఏర్పాటు చేసి మాడగడ, పకనగుడ గ్రామ గిరిజనులకు కేటాయిస్తాం. వ్యూపాయింట్ వద్ద సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం రూ. 25 లక్షలు కేటాయించింది. అటవీ శాఖ ఆధ్వర్యంలో రిజర్వ్ ఫారెస్ట్ సరిహద్దులో చెక్‌పోస్టు ఏర్పాటు చేసి ప్రవేశ రుసుం వసూలు చేస్తాం. ప్రకృతికి విఘాతం కలగకుండా ఏర్పాట్లు చేస్తాం. కమ్యూనిటీ బేసెడ్ ఎకో టూరిజం కమిటీ ఏర్పాటుచేస్తాం. ఉపాధి కోల్పోతామని అపోహ పడొద్దు. – బొర్రా కోటేశ్వరరావు, రేంజర్, అరకులోయ