
సమస్యలు పరిష్కరించాలని వైద్యసిబ్బంది ఆందోళన
● డిప్యూటీ డీఎంహెచ్‌వో
కార్యాలయం ముట్టడి
చింతూరు: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది ఆందోళన చేపట్టారు. దీనిలో భాగంగా మంగళవారం స్థానిక డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ డివిజన్‌లో సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు లేకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రతి పీహెచ్‌సీలో కంప్యూటర్ ఆపరేటర్లను నియమించాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని వారు కోరారు. అనంతరం డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ పుల్లయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తుష్టి జోగారావు, మడివి నెహ్రూ, గుజ్జా సీతమ్మ, కరక అర్జున్, శ్రీనివాస్, రామకృష్ణ, ఆదిలక్ష్మి, భద్రకాళి, సీత, జయ, చంద్రమ్మ పాల్గొన్నారు.