
ఆరోగ్యశ్రీ నిధుల చెల్లింపుల్లో చేతివాటం!
మిగతా 8వ పేజీలో
రంపచోడవరం: స్థానిక ఏరియా ఆస్పత్రికి 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి విడుదలైన నిధులకు సంబంధించి చెల్లింపుల్లో పక్కదారి పట్టాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీలో సేవలందించిన వారికి మాత్రమే ప్రభుత్వం విడుదల చేసిన నిధుల పంపిణీలో చేతివాటం ప్రదర్శించనట్టుగా తెలుస్తోంది.
● స్థానిక ఏరియా ఆస్పత్రికి 2023 నుంచి 2025 మార్చి వరకు అందించిన ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి రూ. 52,21,714 నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. వీటిలో గైనిక్, జనరల్ మెడిసిన్, జనరల్, ఆప్తాల్మిక్ , ఈఎన్‌టీ, ఆర్ధోపెడిక్ , పిడియాట్రిక్ సర్జరీలకు సంబంధించిన నిధులు ఉన్నట్టు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ఆరోగ్యశ్రీ సేవలు అందించిన వారికి అంటే సర్జరీ సమయంలో ల్యాబ్ టెక్నీషియన్లు, ఎఫ్‌ఎన్‌వో, ఎంఎన్‌వో ఇతర సేవలు అందించిన వారికి వీటిని చెల్లించాల్సి ఉంది. అయితే ఆస్పత్రి ఉన్నతాధికారికి అనుకూలంగా ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఖాతాల్లో జమచేసి పక్కదారి పట్టించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆరోగ్యశ్రీలో సేవలందించిన ల్యాబ్ టెక్నీషియన్లకు కూడా చెల్లించలేదని తెలుస్తోంది. దీంతో పలుసార్లు ఆ ఉన్నతాధికారి చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని సమాచారం.
● సర్జరీలకు అవసరమైన పరికరాలను రోగుల నుంచి కొనుగోలు
పక్కదారికి అవకాశం లేదు
ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా ఈ మధ్యనే బాధ్యతలు స్వీకరించా. ఆరోగ్యశ్రీ నిధులు పక్కదారి పట్టే అవకాశం ఉండదు. చెల్లింపులు పారదర్శకంగా జరుగుతాయి. ప్రభుత్వం జీవోలు మార్చినప్పుడు చెల్లింపుల విధానం కూడా మారుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుంటా.
– వి.సూర్యప్రకాష్, సూపరింటెండెంట్, రంపచోడవరం ఏరియా ఆస్పత్రి
రంపచోడవరంలో పథకం ప్రకారం
పక్కదారి పట్టించారని విమర్శలు