
బరిస్టా కాఫీ తయారీపైగిరి యువతకు శిక్షణ
● జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి రోహిణి
పాడేరు రూరల్: బరిస్టా కాఫీ తయారీపై గిరిజన నిరుద్యోగ యవతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి పి. రోహిణి తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ ఇందుకు సంబంధించి అరకులోయ వైటీసీ కేంద్రంలో శిక్షణ తరగతులు ప్రారంభించామన్నారు.ఈ 27 వరకు ఇవి జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కాఫీ బోర్డు ట్రైనర్ యతీష్‌గౌడ, ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ ఉమాశంకర్, ఎస్‌ఐ గోపాల్‌రావు పాల్గొన్నారు.