
బెల్టు దుకాణాలపై దాడి
● 95 మద్యం బాటిళ్లు స్వాధీనం
ఎటపాక: మండలంలో వివిధ ప్రాంతాల్లో ఎకై ్స జ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వచేసిన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పురుషోత్తపట్నం గ్రామంలో చర్చి ఎదురుగా మద్యం అమ్ముతున్న ఓమహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి 50 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నెల్లిపాకలో స్థానికుల ఫిర్యాదు మేరకు ముగ్గురు నుంచి 45 బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేశామని ఎకై ్సజ్ సీఐ విజయలక్ష్మి తెలిపారు.