
అతివేగానికి యువకుడి బలి
కొయ్యూరు: అతివేగం ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సింగవరం గ్రామానికి చెందిన పాంగి అఖిల్ (20) కృష్ణదేవిపేట నుంచి కొయ్యూరు బైక్‌పై బయలుదేరాడు. అతివేగంతో వస్తున్న అతని బైక్ పిట్టాచలం దాటిన తరువాత మలుపువద్దకు వచ్చేసరికి అదుపుతప్పింది. దీంతో డివైడర్‌ను ఢీకొన్నాడు. తలకు తీవ్రంగా గాయమవడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. ఇలావుండగా మృతుడు అఖిల్ తండ్రి సుందర్రావు మంప పోలీసు స్టేషన్‌లో గత ఐదేళ్లుగా హోం గార్డుగా పనిచేస్తున్నారు. కుమారుడు ప్రమాదానికి గురైన సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు సంఘన స్థలానికి చేరుకున్నారు. కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. ఈ హృదయ విదారక దృశ్యం అక్కడ ఉన్న వారందరినీ కంటతడి పెట్టించింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
అదుపుతప్పిన బైక్
డివైడర్‌ను ఢీకొనడంతో
సంఘటన స్థలంలోనే మృతి
కుమారుడి మృతదేహం వద్ద బోరున విలపించిన తల్లిదండ్రులు

అతివేగానికి యువకుడి బలి