
ప్రైవేటీకరిస్తే ఊరుకోం
వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ జిల్లా కేంద్రంలో పాడేరులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన శాంతియుత నిరసనకు అల్లూరి, విశాఖపట్నం జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ప్రైవేటీ కరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే సహించేది లేదని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వైద్య కళాశాలలను
సాక్షి,పాడేరు: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేస్తే ఊరుకునేది లేదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు హెచ్చరించారు. రాష్ట్రంలో పది ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఛలో పాడేరు మెడికల్ కాలేజ్ కార్యక్రమాన్ని శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు ఉచిత వైద్య విద్య, కార్పొరేట్ వైద్యం లక్ష్యంగా రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలు మంజూరు చేశారన్నారు. అంతేకాకుండా వీటికి రూ.8 వేల కోట్లతో భవన నిర్మాణాలు చేపట్టారన్నారు. మారుమూల పాడేరు ప్రాంతంలో కూడా రూ.500 కోట్లతో వైద్య కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టి గిరిజనులకు మేలు చేసేలా చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు. వైద్య కళాశాలల నిర్మాణ పనులను 70శాతం మేర తమ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. మిగతా 30 శాతం పనులను అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం జాప్యం చేస్తోందని ధ్వజమెత్తారు. చేతనైతే కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తే ప్రజల నుంచి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
విద్య, వైద్యానికి జగనన్న పెద్దపీట :
వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకేరాజు
పేద ప్రజలకు విద్య, వైద్యానికి మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారని వైఎస్సార్‌సీపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు కేకేరాజు అన్నారు. నాడు–నేడుతో పాఠశాలలు, ఆస్పత్రులను అభివృద్ధి చేశారన్నారు. 2019 వరకు రాష్ట్రంలో 11 మాత్రమే వైద్య కళాశాలలు ఉండేవని, జగనన్న సీఎం అయిన వెంటనే 17 మెడికల్ కళాశాలలు మంజూరు చేసి చరిత్రలో నిలిచిపోయారన్నారు. పేద విద్యార్థులు డాక్టర్లు అవ్వాలని, పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో వెనుకబడిన ప్రాంతాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తే కూటమి తప్పుడు ప్రచారం చేయడం దారుణమన్నారు. తమ ప్రభుత్వ హయాంలో పాడేరు వైద్య కళాశాల 70శాతం నిర్మాణం పూర్తి చేసుకుని గత విద్యా సంవత్సరంలో వైద్య విద్య తరగతులు ప్రారంభమైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఎందుకు కనబడలేదని ఆయన ప్రశ్నించారు.గిరిజనులకు దుప్పట్లు, పండ్లు పంపించామని చెప్పుకోవడం కాదని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మాదిరిగా గిరిజనాభివృద్ధికి శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు.
పేదలకు వైద్యవిద్య దూరం చేయడం అన్యాయం : అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన 17 వైద్య కళాశాలల్లో పదింటిని ప్రైవేట్‌పరం చేసి పేదలకు వైద్య విద్య, వైద్యసేవలు దూరం చేయడం అన్యాయమని అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి విమర్శించారు. సీఎం చంద్రబాబు బినామీలు, బంధువులకు వీటిని అప్పగించే చర్యలను అడ్డుకుంటామన్నారు. ఐదు వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభమైనప్పటికీ కూటమి పాలకులు తప్పుడు ప్రచారం చేయడం సమంజసం కాదన్నారు.
పెండింగ్ పనులపై నిర్లక్ష్యం : ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర హెచ్చరించారు. పాడేరులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైద్య కళాశాల మంజూరు చేసి రూ.500 కోట్లతో పనులు చేపట్టారన్నారు. పెండింగ్ పనులు పూర్తి చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆమె ధ్వజమెత్తారు.
నినాదాలు చేస్తున్న జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎంపీగొడ్డేటి మాధవి, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, జీసీసీ మాజీ చైర్‌పర్సన్ స్వాతిరాణి
గత ప్రభుత్వంలో 17 కళాశాలలు మంజూరు
రూ.8 వేల కోట్లతో నిర్మాణాలు చేపట్టిన జగనన్న
పేదలకు వైద్య విద్య, కార్పొరేట్ వైద్యసేవలనుదూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం
పాలకులకు తగిన గుణపాఠం తప్పదు
వెఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు,ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు హెచ్చరిక
పాడేరులో ‘ఛలో మెడికల్ కాలేజ్’ విజయవంతం

ప్రైవేటీకరిస్తే ఊరుకోం

ప్రైవేటీకరిస్తే ఊరుకోం

ప్రైవేటీకరిస్తే ఊరుకోం

ప్రైవేటీకరిస్తే ఊరుకోం