
కదంతొక్కిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు
రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శుక్రవారం చేపట్టిన ఛలో పాడేరు మెడికల్ కాలేజ్ శాంతియుత నిరసన కార్యక్రమం విజయవంతమైంది. విశాఖ, అల్లూరి జిల్లాలకు చెందిన వైఎస్సార్‌సీపీ శ్రేణులంతా పాడేరులో కదంతొక్కారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ నేతలను చూసి కూటమి ప్రభుత్వం కలవరపడింది. వంతాడపల్లి అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద వైఎస్సార్‌సీపీ నేతల వాహనాలను పోలీసులతో అడ్డుకునే ప్రయత్నం చేసింది. వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో నేతలంతా చెక్‌పోస్టు వద్ద పోలీసులను నిలదీశారు. అల్లూరి జిల్లా పార్టీ అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. వాహనాలను వదిలిపెట్టాలని డిమాండ్ చేయడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. అక్కడ నుంచి జై జగనన్న నినాదాలు హోరెత్తాయి. పాడేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి వైద్య కళాశాల వరకు భారీ ర్యాలీ జరిగింది. వైఎస్సార్‌సీపీ జెండాలు రెపరెపలాడాయి. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నేతలంతా ఎండగట్టారు. సీఎం చంద్రబాబు డౌన్‌డౌన్ అంటూ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద నేతలు, కార్యకర్తలు బైఠాయించారు. పాడేరు వైద్య కళాశాలలో తరగతులు జరుగుతున్నా సీఎం చంద్రబాబు,ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, మంత్రులు సవిత, అనితలకు కనబడకపోవడం దారుణమంటూ వారంతా మండిపడ్డారు. శాంతియుత నిరసన కార్యక్రమంతో వైద్య కకళాశాల ప్రాంగణం హోరెత్తింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, విశాఖ ఈస్ట్,గాజువాక సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, తిప్పల దేవన్‌రెడ్డి, క్రిష్టియన్ మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జాన్ వెస్లీ, జిల్లా మహిళా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ,వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు గండేరు చినసత్యం, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెట్టి వినయ్, జిల్లా యువజన, విద్యార్థి విభాగం అధ్యక్షులు గబ్బాడ శేఖర్, లోచలి వర ప్రసాద్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు శెట్టి అప్పాలు, కంబిడి అశోక్, రేగం చాణక్య, పాంగి చిన్నారావు, కాతారి సురేష్‌కుమార్, కూడా సురేష్‌కుమార్, సుబ్రహ్మణ్యం, వలంటీర్ల సంఘం రాష్ట్ర నేతలు సురేష్, రాంబాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు జాన్ వెస్లీ, పేర్ల విజయ చంద్ర, ఉత్తరాంధ్ర యువజన విభాగం జోనల్ ఇన్‌చార్జి అంబటి శైలేష్, అల్లూరి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గబ్బాడ శేఖర్, విశాఖ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు పులగం కొండారెడ్డి, తెడబారి సురేష్‌కుమార్ పాల్గొన్నారు.