
పోలీసుల తీరుపై ఎర్రంపేట గిరిజనుల నిరసన
మిగతా II పేజీలో
● కోడిపందాల పేరుతో ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన
● చింతూరు ఐటీడీఏ వద్ద బైఠాయింపు
● పీవో చొరవతో సద్దుమణిగిన వివాదం
చింతూరు: కోడిపందాల పేరుతో పోలీసులు తమను ఇబ్బందులకు గురిచేశారంటూ మండలంలోని ఎర్రంపేటకు చెందిన గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సర్పంచ్ కారం కన్నారావు ఆధ్వర్యంలో ఐటీడీఏ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. బుధవారం చింతూరు మండలం ఎర్రంపేట, కారంగూడెం గ్రామాల మధ్య పొలాల్లో కోడిపందాలు నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆగ్రహించిన ఎర్రంపేటకు చెందిన గిరిజనులు ఈ విషయంపై గురువారం ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్‌కు ఫిర్యాదు చేశారు. ఐటీడీఏ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. పీవో వారితో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. తమ సంస్కృతి, సంప్రదాయాల్లో భాగంగా గ్రామంలో