
ధారాలమ్మ ఘాట్‌లోకూలిన భారీ వృక్షం
● నిలిచిన రాకపోకలు
● పోలీసుల చొరవతో చెట్టు తొలగింపు
సీలేరు: అంతర్రాష్ట్ర రహదారిలో ధారాలమ్మ ఆలయం రెండో మలుపు వద్ద శుక్రవారం భారీ వృక్షం కూలడంతో సుమారు ఐదు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం 9గంటల సమయంలో చెట్టు కూలిపోవడంతో మధ్యాహ్నం రెండు గంటల వరకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రవీంద్ర చొరవతీసుకుని జేసీబీని పంపించారు. సమీప ప్రాంతాల గిరిజనులతో మాట్లాడి చెట్టు తొలగింపునకు చర్యలు చేపట్టారు. ఈ మార్గంలో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు మూడు గంటలపాటు ఆలస్యంగా నడిచాయి.