
వైఎస్సార్‌సీపీ మరింత బలోపేతానికి కృషి
ఆ పార్టీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్‌వెస్లీ
పాడేరు : వైఎస్సార్‌సీపీని బూత్‌లెవెల్ నుంచి మరింత పటిష్టపరిచి ప్రతి ఒక్కరూ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని ఆ పార్టీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొల్లవరపు జాన్‌వెస్లీ అన్నారు. శుక్రవారం పాడేరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు అధ్యక్షతన జరిగిన పార్టీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై శక్తిమేరకు పని చేసి నాయకుడిగా ఎదగవచ్చని సూచించారు. జిల్లాలో క్రైస్తవ ఓట్లు ఎక్కువగా ఉన్నందున వారి సమస్యల పరిష్కారానికి పార్టీ నాయకులు కృషి చేయాలన్నారు. అనంతరం జాన్‌వెస్లీను విశ్వేశ్వరరాజు, పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించారు. వైఎస్సార్‌సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పాంగి ఆంద్రయ్య, జిల్లా అధ్యక్షుడు తిమోతీ, నియోజకవర్గ అధ్యక్షుడు వంతాల కృష్ణారావు, జిల్లా ప్రతినిధులు మోదా బాబూరావు, జోసప్, సాల్మన్, సిమోను పాల్గొన్నారు.