ప్రత్యేక ఆకర్షణగాకారవాన్‌ పార్కులు | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక ఆకర్షణగాకారవాన్‌ పార్కులు

Sep 20 2025 6:06 AM | Updated on Sep 20 2025 6:06 AM

ప్రత్యేక ఆకర్షణగాకారవాన్‌ పార్కులు

ప్రత్యేక ఆకర్షణగాకారవాన్‌ పార్కులు

చింతపల్లి: లంబసింగికి వచ్చే పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక కారవాన్‌ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ)సీనియర్‌ ప్రాజెక్టు కన్సల్టెంట్‌ నిషితాగోయల్‌ తెలిపారు. ఈ మేరకు గతంలో జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ కేటాయించిన ఎకరా స్థలాన్ని ఆమె శుక్రవారం పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రానున్న పర్యాటక సీజన్‌ దృష్టిలో ఉంచుకుని పర్యాటకులు మరింత ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేలా ఈ కారవాన్‌ పార్కును ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే అన్ని సౌకర్యాలతో కూడిన హోంస్టేలు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సీతామహాలక్ష్మి, తహసీల్దారు ఆనందరావు, ఆర్కిటిక్‌ కన్సల్టెంట్‌ కలేశ్వర్రావు, క్యూరేటర్‌ శంకరరావు, ఆర్‌ఐ కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement