
ఎంపీడీవోలుగా 9 మందికి పదోన్నతులు
మహారాణిపేట (విశాఖ): ఉమ్మడి విశాఖ జిల్లాలో పనిచేస్తున్న పరిపాలనాధికారులు(ఏవో), విస్తరణాధికారుల(ఈవోఆర్డీ)కు మండల పరిషత్ అభివృద్ధి అధికారులుగా(ఎంపీడీవో) పదోన్నతులు లభించాయి. మొత్తం 9 మందికి పదోన్నతులతో పాటు పోస్టింగ్‌లు ఇస్తూ జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జె. సుభద్ర వారికి నియామక పత్రాలు అందజేశారు. జి.కె.వీధి ఎంపీడీవోగా బి.హెచ్.వి.రమణబాబు, బుచ్చ య్యపేట ఎంపీడీవోగా కె.ఎన్.సి.నారాయణరావు, రావికమతం ఎంపీడీవోగా ఒ.మహేష్, కశింకోట ఎంపీడీవోగా సి.హెచ్.చంద్రశేఖరరావు, కోట వురట్ల ఎంపీడీవోగా చంద్రశేఖరరావు, నాతవరం ఎంపీడీవోగా ఎం.ఎస్.శ్రీనివాసులు, ఎస్.రాయవరం ఎంపీడీవోగా మీనా కుమారి, పాయకరావుపేట ఎంపీడీవోగా విజయలక్ష్మి, ముంచంగిపుట్టు ఎంపీడీవోగా కె.ధర్మారావు నియమితులయ్యారు. పదోన్నతులు పొందిన అధికారులు వెంటనే విధుల్లో చేరాలని చైర్‌పర్సన్ సుభద్ర సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈవో కె.రాజ్‌కుమార్, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సత్తిబాబు, ఇతర నాయకులు పాల్గొన్నారు.