
విద్యుత్ ఉద్యోగులునల్ల బ్యాడ్జీలతో నిరసన
సీలేరు: దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ జెన్‌కో సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట భోజన విరామసమయంలో స్థానిక ఉద్యోగులు మంగళవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సెంట్రల్ జేఏసీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధి వై.సత్తిబాబు మాట్లాడుతూ దీర్ఘకాల సమస్యల సాధనకై దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని సెంట్రల్ జేఏసీ పిలుపు ఇచ్చిందన్నారు. ఈ మేరకు భోజన విరామ సమయంలో నిరసన తెలిపామన్నారు. బుధ, గురువారాల్లో అన్ని కార్యాలయాల ఎదుట భోజన విరామ సమయంలో ధర్నా, 19,20 తేదీలోఅన్ని సర్కిల్ కార్యాలయాల ఎదుట రిలే నిరాహార దీక్షలు, 22న జిల్లా కేంద్రంలో శాంతియుత ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తామన్నారు. అప్పటికీ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుంటే తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామని ఆయన వెల్లడించారు.