
ఎమ్మెల్సీ బొత్సను కలిసిన అరకు నాయకులు
బీచ్‌రోడ్డు: వైఎస్సార్‌సీపీ పురోగతికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కోరారు. మంగళవారం సిరిపురంలోని క్యాంపు కార్యాలయంలో బొత్సను వైఎస్సార్‌సీపీ అరకు నియోజకవర్గం నాయకులు కలిశారు. నియోజకవర్గంలోని సమస్యలతో పాటు పార్టీలోని పలు అంశాలపై చర్చించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా ప్రజలకు చేస్తున్న మోసంపై ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. పార్టీ ఎప్పుడు కార్యకర్తలకు అండగా ఉంటుందని, పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. బొత్సను కలిసిన వారిలో పార్టీ జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు కార్తీకో అరుణ కుమారి, హుకుంపేట ఎంపీపీ కూడా రాజబాబు, అరకు వ్యాలీ ఎంపీటీసీ దురియ ఆనంద్ కుమారి, మాజీ డిస్ట్రిక్ అగ్రికల్చర్ బోర్డు మెంబర్ విశ్వేశ్వరరావు, సీనియర్ నాయకుడు ఎస్.సోమేష్, తదితరులు ఉన్నారు.