పాడేరు : భాషా పండితులకు పదోన్నతులు కల్పించి న్యాయం చేయాలని గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సింహాచలం కోరారు. ఈ మేరకు ఆదివారం పాడేరు వచ్చిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడును గిరిజన ఉద్యోగుల సంఘం, పలువురు పీఆర్‌టీయూ నాయకులు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. గత ఆరేళ్లుగా భాషా పండితులకు పదోన్నతులు కల్పించడంలో అన్యాయం జరుగుతోందన్నారు. కోర్టు తీర్పునకు అనుగుణంగా స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించి న్యాయం చేయాలని కోరినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.దేముళ్లనాయుడు, ప్రతినిధులు టి. రామస్వామి, డి. కృష్ణమూర్తి, డి. రామ య్య, భాషా పండితుల సంఘం ప్రతినిధులు పరమేష్, టి. రామకృష్ణ పాల్గొన్నారు.