
సోయగాల హోరు సీలేరు
సీలేరు: ప్రకృతి సహజసిద్ధ అందాలకు నెలవు సీలేరు. ఎటుచూసినా ప్రకృతికి పచ్చని చీర కట్టినట్టుగా పచ్చదనంతో కొండలు.. వీటి మధ్య వెలుగులు విరజిమ్మే సీలేరు జలవిద్యుత్ కేంద్రం.. ఉత్పాదనకు నీరందించే గుంటవాడ జలాశయం.. పాలనురగ మాదిరిగా వేల అడుగుల ఎత్తునుంచి జాలువారే జలపాతాలు.. ఇలాంటి అందాలు చూడాలంటే సీలేరు సందర్శించాల్సిందే. వీటిని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశా నుంచి సందర్శకులు తరలివస్తుంటారు. ప్రకృతి అందాలను తిలకించిన అనంతరం ధారాలమ్మ తల్లిని దర్శించుకుని వెళ్తుంటారు. మరువలేని అనుభూతిని పొందుతుంటారు.

సోయగాల హోరు సీలేరు

సోయగాల హోరు సీలేరు