
కూటమి ప్రభుత్వానిది నిరంకుశ పాలన
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిరంకుశ పాలన కొనసాగిస్తోంది. ప్రజా సమస్యలు, అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిపై దాడులకు పాల్పడుతోంది. పత్రికల్లో అవాస్తవాలు రాస్తే ఖండించాలి, లేదా ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయాలి. అంతేకానీ కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేయడం సరికాదు. రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛను హరించాలనుకోవడం పొరబాటు. అన్ని ఆధారాలతో వార్తలు రాసే విలేకరులపై ఏ ఆధారం లేకుండా ప్రభుత్వం కేసులు పెట్టడం సరియైన పద్ధతి కాదు.
– కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే, పాడేరు

కూటమి ప్రభుత్వానిది నిరంకుశ పాలన