
కరాటేతో ఆత్మరక్షణ
ప్రముఖ సినీ నటుడు సుమన్
పాడేరు : కరాటే ఆత్మరక్షణకు ఎంతో అవసరమని విద్యార్థులు ప్రాథమిక విద్య దశ నుంచి తర్ఫీదు పొందాలని ప్రముఖ సినీనటుడు సుమన్ సూచించారు. ఆదివారం పట్టణంలోని సీఏహెచ్ పాఠశాల ప్రాంగణంలో రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా బెల్ట్ టెస్ట్ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడారు. తాను రాజకీయాలకు దూరమన్నారు. ప్రజలకు మేలు చేసే ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలను తాను అభినందిస్తానన్నారు. గిరిజన ప్రాంతాల్లో సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. అనంతరం కరాటే మెగా బెల్ట్ టెస్ట్‌లో ప్రతిభ చూపిన క్రీడాకారులు, విద్యార్థులకు ఆయన బహుమతులు అందజేశారు. అనంతరం నిర్వాహకులు సుమన్‌ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కరాటే ఇండియా చీఫ్ ఇన్‌స్ట్రక్టర్, ఎగ్జామినర్ డాక్టర్ వి. రవి, 4వ డాన్ కరాటే ఇంటర్నేషనల్ గోల్డ్‌మెడలిస్ట్ డాక్టర్ ఎన్. లక్ష్మీ సామ్రాజ్యం, చీఫ్ ఆర్గనైజర్ ఎస్. రాజేశ్వర్‌రావు, రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత చైర్మన్ వంపూరి గంగులయ్య, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ తెడబారికి సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇలావుండగా పాడేరు వచ్చిన సుమన్ ఈ కార్యక్రమానికి ముందు మోడకొండమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబు నాయుడు, ప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అయనను ఆలయ కమిటీ ప్రతినిధులు సత్కరించి, అమ్మవారి చిత్రపటం అందజేశారు.

కరాటేతో ఆత్మరక్షణ

కరాటేతో ఆత్మరక్షణ