
పత్రికా స్వేచ్ఛ హరింపు సరికాదు
పత్రికా స్వేచ్ఛను హరించాలనుకోవడం సరికాదు. ప్రజాసమస్యలను, ప్రభుత్వం చేస్తున్న తప్పులను పత్రికల్లో రాస్తే కేసులు పెడతారా?. ప్రజా సమస్యలను పత్రికల్లో వార్త రూపంలో రాస్తారని, ఓ రాజకీయ నాయకుడు ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన అంశాలను పత్రికల్లో రాస్తే కేసులు పెట్టడం దారుణం. కూటమి ప్రభుత్వం సాక్షి పత్రికపై ఆది నుంచి కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఎడిటర్ ధనుంజయ్ రెడ్డిపై కేసులు పెట్టడం సిగ్గుచేటు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం
దిగజారుడుతనం విరమించాలి. – చెట్టి పాల్గుణ, మాజీ ఎమ్మెల్యే, అరకులోయ