
ఏయూ మీడియా అసోసియేట్ డీన్‌గా సాల్మన్ బెన్నీ
మద్దిలపాలెం (విశాఖ): ఆంధ్రా యూనివర్సిటీ ఔట్రీచ్, బ్రాండింగ్ అండ్ మీడియా అసోసియేట్ డీన్‌గా ఆంగ్ల విభాగం ఆచార్యుడు డాక్టర్ ఎన్. సాల్మన్ బెన్నీ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రెస్ అండ్ మీడియా రిలేషన్స్ డైరెక్టర్, జర్నలిజం ఆచార్యుడు చల్లా రామకృష్ణ ఆచార్య బెన్నీకి బాధ్యతలు అప్పజెప్పారు. ఈ సందర్భంగా ఆచార్య రామకృష్ణ మాట్లాడుతూ ఆచార్య బెన్నీ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయం బ్రాండింగ్ నూతన ఒరవడిని సాధిస్తుందన్నారు. అనంతరం ఆచార్య బెన్నీని ఘనంగా సత్కరించారు. పత్రికా సంబంధాల అధికారిగా, మీడియా రిలేషన్స్ డైరెక్టర్‌గా 33 ఏళ్లుగా ఆచార్య రామకృష్ణ అందించిన సేవలను బెన్నీ కొనియాడారు. 2006లో కామన్వెల్త్ నుంచి బెస్ట్ పీఆర్వోగా కెనడాలో రామకృష్ణ అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం జర్నలిజం విభాగం బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా ఆయన వ్యవహరిస్తున్నారు.