యోగాతో మంచి ఆరోగ్యం
● ఎస్‌డీసీ అంబేడ్కర్
రంపచోడవరం: ప్రతీ వ్యక్తి రోజు 40 నిమిషాల పాటు యోగా చేయడం వల్ల మంచి ఆరోగ్యం పొందవచ్చని ఎస్‌డీసీ పి.అంబేడ్కర్ అన్నారు. గురువారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో విద్యార్థులు, అధికారులు, సిబ్బందితో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ఏడు మండలాల్లో ఈ నెల 21 వరకు ప్రఽభుత్వ ఆదేశాల మేరకు యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. యోగా వల్ల కలిగే ప్రయోజనాలను అందరికీ వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ డీఈవో వై. మల్లేశ్వరరావు, ఎంపీడీవో శ్రీనివాసరావు, శివకుమార్, భవాని, పోతురాజు పాల్గొన్నారు.


