గడువులోగా పూర్తి చేయండి
● సివిల్ ఎస్‌ఈ రవీందర్‌రెడ్డి ఆదేశం
జలవిద్యుత్ కేంద్రంలో ఐదు, ఆరు యూనిట్లకు సంబంధించి జరుగుతున్న సివిల్ పనులను శుక్రవారం సివిల్ ఎస్‌ఈ రవీందర్‌రెడ్డి పరిశీలించారు. ట్రయిల్ రేస్ సంపు, అండర్‌గ్రౌండ్‌లో కొత్త గేట్లు నిర్మించే ప్రదేశాన్ని సందర్శించారు. ఇందుకు సంబంధించిన వివరాలను స్ధానిక సివిల్ అధికారుల నుంచి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. నిర్ణయించిన గడువులోగా పనులు పూర్తయ్యేలా కంపెనీ ప్రతినిధులతో సమన్వయం చేసుకుని పనిచేయాలని ఆదేశించారు. అనంతరం పవర్ కెనాల్‌లో జరుగుతున్న పనులను పరిశీలించారు.


