మాచ్‌ఖండ్ ప్రాజెక్ట్ రోడ్డుకు మరమ్మతులు
ముంచంగిపుట్టు: ఆంధ్ర ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి వెళ్లే మార్గంలో రోడ్డు నిర్వహణలోపం వల్ల పిచ్చిమొక్కలతో నిండిపోయి, గోతులమయంగా మారింది. పలుచోట్ల బండరాళ్లు రోడ్డుపైకి వరద ఉధృతికి కొట్టుకుని వచ్చాయి. దీనివల్ల ఈ ఆరు కిలోమీటర్ల మార్గంలో రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడేవారు. సమస్యను గుర్తించిన ప్రాజెక్ట్ ఉన్నతాధికారులు రోడ్డు మెరుగుకు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా పొక్లెయిన్‌తో బండరాళ్లను తొలగిస్తూ రోడ్డును మెరుగుపరుస్తున్నారు.


