విస్తరణలో ముందడుగు
తెలుగు రాష్ట్రాల్లో జలవిద్యుత్ ఉత్పత్తికి చిరునామాగా నిలిచిన పొల్లూరు కేంద్రం, ఇప్పుడు తన సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటూ విద్యుత్ విప్లవానికి సిద్ధమవుతోంది. ఇక్కడ చేపట్టిన 5, 6 యూనిట్ల నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే పాత యూనిట్లకు, కొత్త నిర్మాణాలకు మధ్య అనుసంధాన పనులు చేపట్టేందుకు తాత్కాలికంగా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. ప్రస్తుతం యుద్ధప్రాతిపదికన జరుగుతున్న ఈ పనులు పూర్తయితే, రాష్ట్ర విద్యుత్ అవసరాలకు ఈ కేంద్రం మరింత ఊతం ఇవ్వనుంది.
మోతుగూడెం: తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో ఐదారు యూనిట్ల నిర్మాణ శరవేగంగా జరుగుతున్నాయి. డొంకరాయి, పొల్లూరు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసి అనుసంధాన పనులను వేగవంతం చేశారు. ఇటు డొంకరాయి జలవిద్యుత్ కేంద్రం నుంచి ఫోర్‌బే రిజర్వాయర్ వరకు తొమ్మిది కిలోమీటర్లు మేర పవర్ కెనాల్‌పనులు చురుగ్గా జరుగుతున్నాయి. కెనాల్‌కు సంబంధించి సైడ్ ప్యానల్స్‌తో పాటు గ్రావెటింగ్, కాంక్రీట్ పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. డొంకరాయి,పొల్లూరు రీచ్‌ల్లో సుమారు 20 మంది కాంట్రాక్టర్లతో పనులు జరిపిస్తున్నారు.
అండర్ గ్రౌండ్ టన్నెల్‌లో.. : ఫోర్‌బే జలాశయం నుంచి అండర్ గ్రౌండ్ టన్నెల వద్ద వికెట్ గేట్ల పనులు ఊపందుకున్నాయి. వాల్వ్‌హౌస్ సర్ధి ట్యాంక్‌లో నీటిని దిగువకు విడుదల చేసి అక్కడ నూతన బల్క్ గేట్లను ఏర్పాటు పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. వాల్వ్ హౌస్ నుంచి పవర్ హౌస్ వరకు పెన్‌స్టాక్, బీఎఫ్ వాల్వ్ అనుసఽంధాన పనులు చురుగ్గా జరుగుతున్నాయి. పవర్‌హౌస్ దిగువ భాగంలో ఉన్న ట్రయిల్ రేస్ సంపులో 90 శాతం నీటిని తొలగించారు. పూర్తిగా తొలగించిన తరువాత నూతన గేట్లు ఏర్పాటుచేస్తామని జెన్‌కో అధికారవర్గాలు తెలిపాయి. ఇప్పటికే అండర్ గ్రౌండ్‌లో నిర్మించే గేట్లను సిద్ధం చేశారు. ఇదే సమయంలో మిగతా యూనిట్లలో సాంకేతిక లోపాలను సరి చేయడంపై అధికారులు దృష్టి సారించారు.
యాభై ఏళ్లు దాటినా..
జలవిద్యుత్ కేంద్రం నిర్మించి సుమారు 50 ఏళ్లు దాటినా అప్పటి ఇంజనీరింగ్ అధికారుల నైపుణ్యానికి అద్దం పడుతోంది. పవర్ హౌస్ దిగువ భాగాన ట్రయిల్ రేస్ సంపులో పూర్తిగా నీటిని తొలగించారు. కింద నుంచి పవర్‌హౌస్ పైభాగం వరకు అప్పటిలో నిర్మించిన కాంక్రీట్ ఇప్పటికీ పటిష్టంగా ఉంది. భవిష్యత్తు తరాలకు ఐదారు యూనిట్లు నిర్మించాల్సి ఉంటుందని ఎంతో ముందు చూపుతో అప్పట్లోనే ప్రణాళికపరంగా చర్యలు చేపట్టారు. ఇవే పనులు ఇప్పుడు చేపట్టాలంటే రూ.వేల కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని జెన్‌కో ఇంజినీరింగ్ అధికారవర్గాలు తెలిపాయి.
పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో శరవేగంగా 5,6 యూనిట్ల పనులు
ఉత్పాదన నిలిపివేసి నిర్మాణాలు
వేగవంతం
అహర్నిశలు శ్రమిస్తున్న ఇంజినీరింగ్
అధికారులు, కార్మికులు
అప్పటి ఇంజనీరింగ్ అధికారుల
నైపుణ్యానికి ప్రతీకగా కట్టడాలు
విస్తరణలో ముందడుగు
విస్తరణలో ముందడుగు


