కరాటేలో గిరి యువకుల ప్రతిభ
● బంగారు పతకాలు సాధన
ముంచంగిపుట్టు: గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మెమోరియల్ కరాటే కుంగ్‌ఫూ ఛాంపియన్‌షిప్‌లో స్థానిక కరాటే క్లబ్ తరఫున పాల్గొన్న గిరిజన యువకులు ప్రతిభ కనబరిచారు. బంగారు పతకాలు సాధించిన వీరిని, కరాటే మాస్టర్ సురేష్‌ను శుక్రవారం ఎస్‌ఐ రామకృష్ణ అభినందనలు తెలిపారు. ఈ పోటీల్లో సూర్యప్రకాష్, వెంకట్, కామేష్, సతీష్‌కుమార్ ప్రతిభ కనబరిచారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి మండలానికి,జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎస్‌ఐ కోరారు. పూర్తిసహకారం అందించిన ఆయనను కరాటే క్లబ్ యువకులు, మాస్టర్ సత్కరించారు.


