విద్యార్థుల సామర్థ్యం మరింత మెరుగు
● టెన్త్ విద్యార్థుల వందరోజుల యాక్షన్ ప్లాన్ సక్రమంగా అమలు
● బాల భవన్ జాయింట్ డైరెక్టర్
రాఘవరెడ్డి ఆదేశం
పెదబయలు: గిరిజన సంక్షేమ ఆశ్రమాల్లో విద్యార్థుల సామర్థ్యాలు మరింత మెరుగపడాల్సిన అవసరం ఉందని బాల భవన్ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ వై.రాఘవరెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల–2ను సందర్శించారు.ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛ హేవం హరిత విద్యాలయం కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ ప్రాంతలో పర్యటించారు. తెలుగు,గణితం, ఆంగ్లంలో ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. వారి సామర్థ్యాలను అంచనా వేశారు. గ్యారెంటీ ఎఫ్‌ఎల్‌ఎన్ ప్రోగ్రాం అమలుతీరును తెలుసుకున్నారు. భోజన మెనూ అమలును పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. అలాగే పరిశుభ్ర వాతావరణంలో వంట చేయాలన్నారు. విద్యార్థులు వినిమోగిస్తున్న మరుగుదొడ్లు, పాఠశాల కిచెన్ గార్డెన్‌ను పరిశీలించారు. అనంతరం సీతగుంట గిరిజన సంక్షేమ బాలూర పాఠశాల–1ను సందర్శించారు.టెన్త్ విద్యార్థుల నుంచి వందరోజుల యాక్షన్ ప్లాన్ అమలును తెలుసుకున్నారు. వారి నోట్ పుస్తకాలను పరిశీలించారు. గణిత ఉపాధ్యాయులు వెనుకబడిన విద్యార్థుల కోసం తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. ప్రతిరోజు స్లిప్ టెస్టులు నిర్వహించాలన్నారు. లీప్ యాప్‌లో విద్యార్థుల మార్కులు అప్‌లోడ్ చేయాలని సూచించారు. సీ,డీ గ్రేడ్ విద్యార్థులకు ప్రత్యేక కార్యాచరణ, ప్రణాళికలు రూపొందించాలన్నారు. సమగ్ర శిక్ష జిల్లా కమ్యూనిటీ మొబలైజేషన్ అఽధికారి ఎం.జ్ఞానప్రకాష్, ఎంఈవోలు కె. కృష్ణమూర్తి, పుష్పజోసెప్, హెచ్‌ఎం చిట్టమమ్మ, సీఆర్పీలు పాల్గొన్నారు.
విద్యార్థుల సామర్థ్యం మరింత మెరుగు


