
మనస్తాపంతో వివాహిత మృతి
వి.ఆర్.పురం: మండలంలోని ధర్మతాళ్లగూడెంలో మనస్తాపంతో గిరిజన మహిళ సోందె వెంకటరమణ (42) శనివారం మృతి చెందింది. ఈ మేరకు పోలీసుఉలు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మతాళ్లగూడెంలో చంద్రయ్య, వెంకటరమణ నివాసముంటున్నారు. పెద్ద కుమార్తె అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తాళలేక వెంకటరమణ మనస్తాపం చెంది పురుగుల మందు తాగింది. కోతులగుట్ట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు మృతదేహాన్ని అప్పగించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సంతోష్‌కుమార్ తెలిపారు.