
ఆర్టీసీ సిబ్బంది యోగా సాధన
పాడేరు : జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం స్థానిక ఆర్టీషీ డిపో ఆవరణలో ఆర్టీసీ సిబ్బంది యోగా సాధన చేశారు. యోగా ట్రైనర్, స్పోర్ట్స్ అధారిటీ అధికారులు ఆర్టీసీ సిబ్బంది చేత యోగా సాధన చేయించారు. యోగా యొక్క విశిష్టతను వారికి వివరించారు. యోగా వలన మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతుందని అవగాహన కల్పించారు. ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్, జిల్లా స్పోర్ట్ అధారిటి అధికారి జగన్‌మోహన్‌రావు, యోగా ట్రైనర్, పిజికల్ డైరెక్టర్లు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.