
‘లేటరైట్’ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా
గూడెంకొత్తవీధి: ప్రత్యేక డీఎస్సీ ఏర్పాటు కోరుతూ గిరిజనులు చేపట్టిన నిరవధిక బంద్ ప్రభావం డొకులూరు జరగాల్సిన లేటరైట్ ప్రజాభిప్రాయ సేకరణ శిబిరంపై చూపింది. బంద్ కారణంగా అధికారులు హాజరుకాలేకపోవడంతో వాయిదా పడింది. డొకులూరులో లేటరైట్ కోసం పలువురు దరఖాస్తు చేసుకోవడంతో దీనిపై అదే ప్రాంతంలో శనివారం ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేశారు. నిరవధిక బంద్ కారణంగా అధికారులు రాలేకపోయారని తహసీల్దార్ టి.రామకృష్ణ తెలిపారు. అందువల్ల వాయిదా పడిందని త్వరలో మరో తేదీని ప్రకటించి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తామని ఆయన వివరించారు. అధికారులు రాలేకపోవడంతో గిరిజన సంఘాల నేతలు, రైతులు వెనుదిరిగారు.
నిరవధిక బంద్ వల్ల రాలేకపోయిన
అధికారులు

‘లేటరైట్’ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా