
విద్యుత్ సదుపాయం కల్పనకు ప్రతిపాదనలు
● చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్
మోతుగూడెం: పోర్‌బే, ఒడియా క్యాంప్, ఇంతలూరువాగు, తడికావాగు గ్రామాల్లో విద్యుత్ సదుపాయం కల్పించేందుకు ప్రతిపాదనలు పంపిస్తామని చింతూరు ఐటీడీఏ పీవో అపూరర్వ భరత్ తెలిపారు. బుధవారం ఆయన అధ్యక్షతన స్థానిక ఏపీ జెన్‌కో అతిథి గృహంలో ఐటీడీఏ అనుబంధ శాఖలు, ప్రజాప్రతినిధులు, స్ధానికులతో సమావేశం నిర్వహించారు. ముందుగా మోతుగూడెంలో డ్రైనేజీ వ్యవస్ధ, ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా భూములు, తాగునీరు, జెన్‌కో అతిథి గృహాల సమస్యలు గురించి చర్చించారు. పీహెచ్‌సీ భవన నిర్మాణం కోసం జెన్ ఇంజనీర్లు, తహసీల్దార్‌తో మాట్లాడారు. త్వరగా భూమిని గుర్తించి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. మోతుగూడెంలో వీధి లైట్లు ఏర్పాటు చేయాలని స్ధానికులు కోరారు. 2016లో మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలు మధ్య నిలిపోయాయని పీవో దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఈ స్వామినాయుడు, డీఈలు బాలకృష్ణ, వరప్రసాద్, కార్యదర్శి మోహన్, ఏడీఈ కొండబాబు, అటవీ అధికారులు పాల్గొన్నారు