
కస్తూర్బా కళాశాలలకు అదనపు భవనాలు
రంపచోడవరం: ఏజెన్సీలో విద్యాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ వెల్లడించారు. రంపచోడవరంలోని కేజీబీవీ కళాశాలలో అదనపు తరగతి గదులు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి,పీవో కట్టా సింహాచలం, సబ్ కలెక్టర్ కల్పశ్రీ, ఎంపీపీ బందం శ్రీదేవి, జెడ్పీటీసీ పండా వెంటకలక్ష్మిలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రంపచోడవరం, మారేడుమిల్లి, నెల్లిపూడి,రాజవొమ్మంగి కేజీబీవీ బాలికల జూనియర్ కళాశాలల్లో అదనపు తరగతి భవనాలకు ఎస్‌ఎస్‌ఏద్వారా ఒక్కో కళాశాలకు రూ. 60 లక్షలు మంజూరు చేస్తామన్నారు. భవనాలను నాణ్యతగా నిర్మించాలని ఇంజనీర్లుకు సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పల్లాల కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ వై.నిరంజనీదేవి తదితరులు పాల్గొన్నారు.
ఇంటి పేరు తప్పుపై ఎంపీపీ అభ్యంతరం
గంగవరం : రంపచోడవరంలోని కస్తూర్బా జూనియర్ కళాశాల ఆవరణలో బుధవారం కలెక్టర్ ఆవిష్కరించిన నెల్లిపూడి కస్తూర్బా జూనియర్ కళాశాల భవన శిలాఫలకంపై తన ఇంటి పేరు తప్పుగా ఉండటంపై ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తన ఇంటి పేరు పల్లాలకు బదులు బల్లా అని ఉందన్నారు. అధికారులకు తన పేరు పూర్తిగా తెలియకపోవడం వారి నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక్కోదానికి రూ.60 లక్షలు
కలెక్టర్ దినేష్‌కుమార్