
ఎట్టకేలకు ఎల్‌టీ లైన్‌కు మరమ్మతులు
● గోదావరి వరదను తట్టుకునేలా
ఎత్తయిన విద్యుత్ స్తంభం ఏర్పాటు
కూనవరం: మండల కేంద్రంలోని బెస్తబజార్, గిన్నెలబ జారు, సాయిబాబా గుడికి వెళ్లే మూడు రోడ్ల కూడలిలో విద్యుత్ ఎల్‌టీ లైన్‌కు బుధవారం ఎట్టకేలకు మరమ్మతులు చేపట్టారు. గోదావరి వరదలకు పాత విద్యుత్ స్తంభం ఒరిగిపోవడంతో విద్యుత్ వైర్లు జారిపోయి ఇళ్లను తాకుతున్నాయి. దీనివల్ల ఏక్షణంలో ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురయ్యేవారు. ఈవిషయాన్ని స్థానిక విద్యుత్ ఏఈ రాజ్‌కపూర్ దృష్టికి తీసుకు వెళ్లడంతో స్పందించిన ఆయన ఎలాంటి అంతరాయం లేకుండా వరద ఉధృతిని తట్టుకునేలా ఎత్తయిన విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేశారు. పాత స్తంభం వైర్లను తొలగించి కొత్తదానికి అమర్చడంతో సమీప ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సమస్యను పరిష్కరించిన ఏఈకి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.