
ప్రతి నెలా హైదరాబాద్ నుంచి వస్తా..
వృత్తిపరంగా ఆంధ్రా బ్యాంకులో సీనియర్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తూ.. ఒత్తిడి నుంచి రిలాక్స్ అవ్వడానికి అప్పట్లో విశాఖ హ్యూమర్ క్లబ్ నిర్వహించే కామెడీ షోకు హాజరయ్యేవాడిని. వారి ప్రదర్శనకు ఆకర్షితుడినై చాలా సార్లు సాయం అందించాను. స్నేహితుల సలహాతో 2012లో స్వయంగా ఫ్రెండ్స్ కామెడీ క్లబ్ స్థాపించాను. వినోదవల్లరి పేరుతో ప్రతి నెలా మొదటి ఆదివారం విశాఖ పౌరగ్రంథాలయంలో రెండు గంటల సేపు కామెడీ స్కిట్స్ ప్రదర్శిస్తున్నాం. ఐదేళ్లుగా హైదరాబాద్, గోదావరిఖనిలో కూడా ప్రదర్శనలిస్తున్నాం. దాదాపు రెండు వేలకు పైగా ప్రదర్శనలు పూర్తి చేశాం. బ్యాంకు సీనియర్ మేనేజర్‌గా పదవీ విరమణ చేశాక హైదరాబాద్‌లో స్థిరపడ్డాను. అయినా హాస్యంపై మక్కువతో ప్రతి నెలా మొదటి ఆదివారం విశాఖ వచ్చి.. క్లబ్ ద్వారా కామెడీ స్కిట్స్ ప్రదర్శించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నాను. క్లబ్ కార్యదర్శి ఎస్.వి.రాజేశ్వరి, జబర్దస్త్ ప్రకాష్, డేవిడ్ రాజు, కుమారి, పోర్టు శేషు, పుష్యమి, నాయుడు, వెంకటేశ్వరరావులతో కలిసి కామెడీ స్కిట్స్ ప్రదర్శిస్తున్నాను. –ఎం. వి.సుబ్రహ్మణ్యం, ప్రెండ్స్ కామెడీ క్లబ్ అధ్యక్షుడు