
కిశోర బాలికలకు అవగాహన
కొయ్యూరు/గూడెం కొత్తవీధి/చింతపల్లి/చింతూరు/గంగవరం: జిల్లా వ్యాప్తంగా కిశోర వికాసం వేసవి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమైయ్యాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ఐసీడీఎస్ సీడీపీవోలు, వివిధ శాఖాధికారులు మాట్లాడుతూ బాలికా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కిశోరి వికాసం పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో విద్య ప్రాముఖ్యత, సంపూర్ణ ఆరోగ్యం, రుతు పరిశుభ్రత, పోషకాహారం, పోక్సో, బాల్య వివాహాల నిరోధ చట్టం, ఆత్మరక్షణ, సైబర్ క్రైమ్, జీవనోపాధి, స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ నెల 2 నుంచి జూన్ 10 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సీడీపీవోలు విజయకుమారి, లక్ష్మీదేవి, రమణి, విజయగౌరి, సూపర్‌వైజర్లు సునీత, మహాలక్ష్మి, కొండమ్మ, శేఖర్, ప్రవీన్, మోహిని, శాంతి, విజయకుమారి, సత్యవతి, ఏసీడీపీవో రామలక్ష్మి, గంగాభవాని, ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు మోహన్‌రావు, ఐటీడీఏ ఏపీవో జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు.

కిశోర బాలికలకు అవగాహన