
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
సీలేరు: గూడెం కొత్తవీధి మండలం సీలేరుకు 5కి.మి.దూరంలో గల ఐస్‌గెడ్డ జలపాతం వద్ద దిచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. చిత్రకొండకు చెందిన వంతల సుకదేవ్, బుడితీలు గు రువారం సాయంత్రం సీలేరు పనిమీద వస్తుండగా ఐస్‌గెడ్డకు వచ్చేసరికి భధ్రాచలం నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ సంఘటనలో బుడితికి కాలువిరిగి చేతికి గాయమైంది.సుకదేవ్‌కు స్వల్పగాయాలయ్యాయి. బస్సులోని ప్రయాణికులు సీఎస్‌ఆర్ ఆంబులెన్సుకు సమాచారం ఇవ్వగా, బాధితుల్లో ఒకరు చిత్రకొండ అంబులెన్సుకు సమాచారం ఇచ్చారు. రెండు అంబులెన్సులు ఒకేసారి రావడంతో బాధితులు చిత్రకొండ వెళ్లేందుకు అంగీకరించడంతో చిత్రకొండ అంబులెన్సులో బాధితులను తరలించారు.
ఇద్దరికి తీవ్రగాయాలు

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు