
మూడు రోజుల వ్యవధిలో టన్ను వరకు..
ప్లాస్టిక్ వ్యర్థాలతో సముద్రం కలుషితమవుతున్న నేపథ్యంలో సామాజిక బాధ్యతలో భాగంగా స్కూబా డైవర్లు.. సముద్ర పరిరక్షణకు పాటుపడుతున్నారు. వీరికి బయో వ్యర్థాలు కనిపిస్తుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్ర లోతుల్లో పోగుపడ్డ ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే బాధ్యతను ఇటీవల కాలంలో ప్లాటిపస్ వంటి స్కూబాడైవింగ్ సంస్థలు స్వచ్ఛందంగా చేపడుతున్నాయి. సముద్ర గర్భంలో వ్యర్థాల ఏరివేత కోసం ఈ బృందాలు 3 కిలో మీటర్ల దూరం వరకూ వెళ్తున్నాయి. ఒడ్డు నుంచి ప్రారంభించి.. మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న వ్యర్థాల్ని తొలగిస్తున్నారు. ప్రతి రోజూ కనీసం 100 నుంచి 200 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రం నుంచి వెలికితీస్తున్నారు. ఇందులో కనీసం 10 నుంచి 20 కిలోల వరకూ బయో వ్యర్థాలు ఉంటున్నాయని వారు చెబుతున్నారు. మూడు రోజుల వ్యవధిలో టన్ను వరకూ స్కూబా డైవర్లు మెడివేస్ట్ ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యర్థాలు సముద్ర జీవరాశులతో పాటు.. పర్యాటకులకు ప్రాణహానిని కలిగిస్తుందని, అధికారులు తక్షణమే బయో వ్యర్థాలు సముద్రంలో కలవకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.