
కార్యకర్తలకు ఏ కష్టం రానివ్వం
రంపచోడవరం: నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత తమదని ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్(అనంతబాబు), మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. రంపచోడవరం మండలం వెలమలకోటలో గురువారం పార్టీ కార్యకర్తలు, నాయకులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త, నాయకుడు కష్టపడి పనిచేయాలన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో మిర్చీకి గిట్టుధర కల్పించి, క్వింటాకు రూ.23 వేలు చెల్లిస్తే, కూటమి ప్రభుత్వం రూ.11వేలు నిర్ణయించిందని, దీంతో విలీన మండలాల్లో రైతులు గగ్గోలు పెడుతున్నారని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇలా అన్ని వర్గాల ప్రజలు అవస్థలకు గురవుతున్నారని, కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరికీ న్యాయం జరిగే పరిస్థితి లేదని చెప్పారు. వైఎస్సార్ సీపీ హయాంలో ఏజెన్సీలో పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బందం శ్రీదేవి, జెడ్పీటీసీ పండా వెంకటలక్ష్మి,వైస్‌ఎంపీపీ పండా కుమారి, నాయకులు జల్లేపల్లి రామన్నదొర, పండా రామకృష్ణదొర,రాపాక సుదీర్‌కుమార్, ఎంపీటీసీలు ఉలవల లక్ష్మి, సర్పంచ్‌లు మంగా బొజ్జయ్య, వడగల ప్రసాద్ పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ అనంతబాబు,
మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి