సీలేరు: జిల్లాలో పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టామని జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజిరావు తెలిపారు. ఆదివారం సీలేరు వచ్చిన ఆయన ఇక్కడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలో 258 హైస్కూళ్ల నుంచి 11,760 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారని, వీరికోసం జిల్లాలో 71 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా ఏడుగురు ప్రత్యేకాధికారులను, సిట్టింగ్ స్క్వాడ్‌లను నియమించామన్నారు. ఆయా సెంటర్లలో ఏమైనా మాస్ కాపీయింగ్, ఇతర సంఘటనలు జరిగితే వెంటనే వారు జిల్లా కలెక్టరు సమాచారం ఇస్తారని తెలిపారు. అల్లూరి జిల్లా విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో 8 స్క్వాడ్‌లను మంజూరు చేశారన్నారు. వీరు రంపచోడవరం, పాడేరు డివిజన్ పరిధిలో పర్యవేక్షణలో ఉంటారని, 25 పరీక్ష కేంద్రాలకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. హెచ్‌ఎం కె.నాగభూషణం పాల్గొన్నారు.
మాస్ కాపీయింగ్ పాల్పడకుండాపటిష్ట చర్యలు